by Suryaa Desk | Fri, Nov 08, 2024, 02:42 PM
ప్రపంచ క్యాన్సర్అవగాహనా దినోత్సవ కార్యక్రమం సంధర్బంగా జగదేవపూర్ మాస్టర్ మైండ్ స్కూల్ అధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రాథమిక అరోగ్య కేంద్రం వరకు ర్యాలీ తీయడం జరిగింది. తరువాత బస్ స్టాండు నందు మరియు గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి పీహెచ్ సి నందు సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో స్కూలు విద్యార్థులు డాక్టర్ ను పలు సందేహాలను వ్యక్తపరిచి సందేహాలను నివృత్తి పరచుకున్నారు .ఈ కార్యక్రమానికి జిల్లా ప్రోగ్రాము ఆఫిసర్ డాక్టరు ఆనంద్ ముఖ్య అతిధిగా విచ్చేసినారు. అనంతరం డాక్టరు సత్యప్రకాశ్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా వ్యాధులు వస్తున్నాయని, వివిధ వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.
ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మరి చాలా ప్రమాదకరమని క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. బయట ఆహరాన్ని బందు చేసుకోవాలని జంక్ ఫుడ్ తినవద్దని సూచించారు. అలాగే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని వివరించారు. క్యాన్సర్ ప్రమాదకరం కాదని అవగాహన కలిగి ఉంటే నివారణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, మాస్టర్ మైండ్ స్కూల్ కరస్పాండెంట్ రాఘవేంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, ఇంచార్జి నర్సింములు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గోన్నారు.