by Suryaa Desk | Fri, Nov 08, 2024, 03:23 PM
డిండి మండలంలో గురువారం ఏఐటీయూసీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లుపాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను రాస్తూ 29 కోడ్లు ఉన్న చట్టాలను నాలుగు కోడ్లు గా కుదించి కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం 192 0 అక్టోబర్ 31వ తేదీన ఏర్పడినటువంటి భారతదేశంలో మొట్టమొదటి సంఘం ఏఐటియుసి ఆనాటి నుంచి నిత్యం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ,చట్టాల కోసం అనేక పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి కార్మికుల నెత్తుటి మరకల పై నిర్మించినటువంట సంఘం ఏఐటియుసి ,మిర్యాలగూడ కరీం ఫంక్షన్ హాల్లో 7నసోమవారం రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ,కార్మికులు సమయాన్ని పాటించవలసిందిగా ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు భుషిపాక లింగమయ్య ,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎలిమినేటి దేవయ్య ,గ్రామపంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు రామావత్ జోహార్ లాల్ ,బాలరాజు ,అంజి ,కిన్నెరగంగమ్మ,వంగూరి,సిపోరా ,జంతుకభాగ్యమ్మ ,ఔటలక్ష్మమ్మ తదిరులు పాల్గొన్నారు...