by Suryaa Desk | Fri, Nov 08, 2024, 02:24 PM
ప్రజల కు ఏ ఆపద వచ్చిన నేను ముందుంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం వట్ పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం, అభినందన సభకు జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, ప్రజల కు తాను అండగా ఉండాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి గెలుపు కోసం సాయి శక్తుల కృషి చేయునట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రజలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే తనకు కానీ, సంగారెడ్డి లోని తన కార్యాలయంలో కానీ సంప్రదిస్తే మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయనున్నట్లు తెలిపారు.
వట్ పల్లి ఆభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ తో ముందుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అదునాతన వసతులతో వట్ పల్లి మార్కెట్ యార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వట్ పల్లి మార్కెట్ యార్డ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారిందన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన సమయంలో ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో వెళ్లడానికి ప్రజలు భయపడేవారని అలాంటిది ప్రస్తుతం వట్ పల్లి ఒక పెద్ద పట్టణంగా మారింది అన్నారు. అల్లాదుర్గం మెటల్ కుంట, జోగిపేట - వట్ పల్లి , సంగుపేట- పుల్కల్ , అందోల్ నియోజకవర్గంలోని,రోడ్ల మరమత్తు పనులు రూ. 152 కోట్లతో త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వట్ పల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనం, మండల కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. వట్ పల్లి ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నట్లు తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తన తండ్రి ఈ ప్రాంతంలో 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని , తాను ఇక్కడ 33 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారని, తనను తన తండ్రిని ఆదరించిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేయనున్నట్లు తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ స్థాయి నుండి సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందేలా కార్యకర్తలు విభేదాలు మర్చి ఏకతాటిపై ఉండి పార్టీ కార్యకర్తలు గెలిపించాలని తద్వారా ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందేలా చూడనున్నట్లు మంత్రి తెలిపారు.
గతంలో 2004 సంవత్సరంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో జహీరాబాద్ ఎంపీగా సురేష్ షట్కర్ ఉన్న సమయంలో రోడ్డు వెడల్పు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు 32 కోట్లతో సుమారు 41 కిలోమీటర్లు రోడ్డు వెడల్పు పనులు చేపట్టినట్లు తెలిపారు.
అప్పటినుండి ఇప్పటివరకు గత ప్రభుత్వాలు కనీసం రోడ్డు మరమ్మతులు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రాంత అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీకి ఉన్న శ్రద్ధ అల్లాదుర్గం మెటల్ కుంట రోడ్డున చూస్తే అర్థమవుతుంది అన్నారు. త్వరలో నియోజకవర్గంలోని అన్ని రోడ్ల మరమ్మత్తు పనులు రూ.152 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ శేష రెడ్డి, వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య, జోగి పేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఆర్ డి ఓ పాండు, మాజీ జెడ్పిటిసి సభ్యులు మల్లికార్జున పాటిల్, రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు మరెల్లి సంగమేశ్వర్ , నరేందర్ రెడ్డి, శ్రీశైలం, జానయ్య, శివశరణ్ దిగంబరావ్ ,రమేష్ ,శ్రీకాంత్ రెడ్డి, కార్తీక్ గౌడ్ ,మార్కెటు కార్యదర్శి సునీల్ కుమార్. సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.