by Suryaa Desk | Fri, Nov 08, 2024, 02:17 PM
బిసి సంక్షేమ సంఘం ధర్మారం మండల అధ్యక్షులుగా ఖిలావనపర్తి గ్రామానికి చెందిన సాగంటి కొండయ్య, తండ్రి నర్సయ్య ముదిరాజ్ ను నియమించినట్లు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నల్ల వెల్లి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ నియామక పత్రం ఈ రొజు నుండి అమల్లొకి వస్తుంది. ఈ సందర్భంగా సాగంటి కొండయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియమించినందుకు బిసీల సంక్షేమం కొరకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
తన నియామకానికి సహకరించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్నం ప్రకాష్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరుగంటి భార్గవరామ్,పెద్దపల్లి జిల్లా బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కొమ్మ స్వామి, మిత్రులు ముత్యాల విరస్వామి,సాగంటి నర్సయ్య, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.