by Suryaa Desk | Fri, Nov 08, 2024, 03:26 PM
దేవరకొండ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు పొట్ట మురళి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్రం స్వాగతిస్తుందని మాయ మాటలు చెప్పి ఇప్పటివరకు వర్గీకరణ గురించి ఉత్తర్వులు జారీ చేయకపోవడం సిగ్గుచేటు అదే విధంగా నిన్నమన్న జరిగిన ప్రభుత్వ ఉద్యోగాలలో జీవో 55 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కొత్త జీవో 29 ప్రకారం ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందని రిజర్వేషన్ ప్రకారం మాదిగలకు రావలసిన ఉద్యోగాలు రాకుండ మాదిగ జాతికి అన్యాయం చేయడం జరిగిందని ప్రభుత్వాన్ని విమర్శించారు.
వర్గీకరణ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే నా జాతి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందుగుల సైదులు మాదిగ చందంపేట మండల అధ్యక్షులు కొమ్ము ఉదయ్ దేవరకొండ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు తరి గోవర్ధన్ దర్శనం శివ ఎర్ర విజయ్ చాట్లా ప్రశాంత్ రత్నయ్య లక్ష్మణ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.