by Suryaa Desk | Fri, Nov 08, 2024, 03:19 PM
స్వచ్ఛందంగా కులగణన సర్వేకు ప్రజలందరూ సహకరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం నాగల్ గిద్ద మండల పరిధిలోని ఔదత్ పూర్ గ్రామంలో సామాజిక,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ,సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కుల గణన సర్వేలో అధికారులు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో స్వచ్ఛందంగా ప్రజలందరూ అధికారులకు సహకరించాలని అన్నారు. గ్రామంలో పూర్తిస్థాయిలో కుటుంబ వివరాలను నమోదు చేయించాలని ఎమ్మెల్యే గ్రామస్తులను కోరారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటూ వస్తుందని అందులో భాగంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు కుల గణన సర్వేను చేపట్టిందన్నారు. కుల గణన పై గతంలో చాలామంది మాట్లాడారే తప్ప ఆచరణలోకి తీసుకురాలేక పోయారన్నారు.వలసలు వెళ్లిన వారి కుటుంబ వివరాలను డోర్ లాక్ చేయబడి ఉన్న కుటుంబ వివరాలను సైతం గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని వారి కుటుంబ వివరాలను నమోదు చేయించాలన్నారు.
యుద్ద ప్రాతిపదికన జరిగే ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలోనే నారాయణఖేడ్ నియోజకవర్గన్ని రోల్ మోడల్ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరు చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నర్సింగ్ రావు పాటిల్,గుండేరావు పాటిల్ ,అనిల్ పాటిల్,సంజీవ్ పాటిల్,దేవ రెడ్డి,మాజీ సర్పంచ్లు,సంతోష్,సచిన్ పాటిల్, అంబ్రేష్,హన్మంతు,రహీమ్, పండరి,నర్సింగ్, ఆకాష్,తదితర నాయకులు పాల్గొన్నారు