by Suryaa Desk | Fri, Nov 08, 2024, 04:23 PM
జిల్లాలోని వరిధాన్య కోనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు. గురువారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గల వరిధాన్య కోనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.గ్రామ రైతులతో మాట్లాడాగా ఈ చుట్టూ ప్రక్కన గల చిన్న చిన్న గ్రామాలకు ఈ ఐకెపి సెంటర్ లలోనే వరిధాన్యం కోనుగోలు చేస్తున్నామని, అలాగే పాడి క్లీనర్లు 4 ఉన్నాయు కానీ వాటికి సరిపడా విద్యుత్ సౌకర్యం అందక వైర్ కాలిపోందుందని, సెంటర్ లో గన్ని బ్యాగ్ లు ఇచ్చారు కాని టార్పాలిన్ కవర్లు, సంచులు ధాన్యం తో నింపి కుట్టడానికి సూతిల్ దారాలు ఇవ్వడం లేదని తేమశాతం రాగానే వేంటనే లారిలలో ఎక్కించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ లైన్ విషయంలో మండల ఎఈ వచ్చి కరెంట్ కెపాసిటీ ప్రకారం విద్యుత్ సౌకర్యం.
కల్పిస్తాడని అలాగే రాత్రి వేళల్లో ధాన్యం వద్ద ఉండేందుకు స్ట్రీట్ లైట్లు వేస్తామని, తేమశాతం రాగానే వేగంగా లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని అలాగే టార్పాలిన్ కవర్లు, సూతిల్ దారాలు తప్పనిసరిగా సెంటర్ ఇంచార్జిలు అందించాలని లేని యేడల కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంటర్లకి వచ్చి ధాన్యాన్ని అమ్ముకునేలా ప్రతి ఓక్క అదికారి పనిచేయ్యాలని ఆదేశించారు. డిఆర్డిఎ పిడి జయదేవ్ ఆర్యా, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, సెంటర్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.