by Suryaa Desk | Fri, Nov 08, 2024, 03:12 PM
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా ద్వారా మంజూరైన రూ.24లక్షల 60 వేల చెక్కులను 60 మంది లబ్ధిదారుల కుటుంబాలకి ఆయన అందజేశారు.ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలోనాయకులు సంజీవ రెడ్డి ,అక్తర్, శ్రీనివాస్ ,పోతుల రాజేందర్ ,కాశినాథ్ యాదవ్ , ఎండీ ఇబ్రహీం, అష్రాఫ్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ పంతులు, మల్లేష్ పాల్గొన్నారు.