![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:53 AM
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే సేఫ్టీ విషయంలో చాలా కష్టపడ్డానని బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడు ఎవరు తలుపు కొడతారని చాలా భయంతో మేకప్ ఆర్టిస్ట్‌ను ఎప్పుడూ సాయంగా ఉంచుకునేదాన్ని. ఇతర హీరోయిన్లు తలుపులు చాలామంది కొట్టి ఉంటారు. నేను అప్పటికే అందాల పోటీ గెలవడం వల్ల, ఫేమస్ కావడంతో అంత త్వరగా ఎవరూ మిస్‌బిహేవ్ చేయలేదు’ అని అన్నారు.‘2000లో నేను, ప్రియాంకా చోప్రా, లారా దత్తా.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రియాంకకు కుటుంబసభ్యుల నుంచి ఎంతో సపోర్ట్ ఉండేది. మాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. మోడలింగ్‌లో రాణిస్తోన్న కారణంగా అప్పటికే లారా ముంబయిలో ఒక ఇరికింట్లో అద్దెకు ఉండేది. నేను ముంబయి వచ్చినప్పుడు.. ఆమె నాకెంతో సాయంగా నిలిచింది. తన రూమ్‌లో ఉండేందుకు అవకాశం కల్పించింది. చిన్న ఇల్లే అయినప్పటికీ మేమిద్దరం సర్దుకుపోయాం. ఫ్యాషన్ షోల్లో పాల్గొని.. ఖరీదైన దుస్తులు ధరించినప్పటికీ ఒక్కోసారి చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. చాలీచాలని డబ్బుతోనే జీవితాన్ని కొనసాగించాం. కొన్నిసార్లు నూడుల్స్ తిని రోజులు గడిపాం. మా పరిస్థితిని తలుచుకొని నవ్వుకునేవాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. తినేది మాత్రం నూడుల్స్ అనుకునేవాళ్లం’’ అని దియామీర్జా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
Latest News