|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:50 AM
‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాలతో తెలుగుతెరకు దగ్గరైన నిధి అగర్వాల్ మూడేళ్ల విరామం తర్వాత ‘హరిహర వీరమల్లు’తో జత కట్టింది. తన అందం, అభినయంతో వీరమల్లు మనసునే కాదు... కుర్రకారు మనసుని కొల్లగొట్టిందీ గ్లామర్ డాల్. ఈ సందర్భంగా ‘గ్యాప్ ఇవ్వలేదు... వచ్చింది’ అంటున్న అందాల నిధి మాట్లాడుతూ... నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ అత్యుత్తమమైనది. ఇందులో నేను పోషించిన పంచమి పాత్ర శారీరకంగా నాకు ఎన్నో సవాళ్లు విసిరింది. ఇందులో బరువైన కాస్ట్యూమ్స్, ఆభరణాలు ధరించా. ప్రతీరోజూ ఒంటి మీద కనీసం 35 కిలోల బరువు మోసేదాన్ని. భారీ దుస్తులు, నగలతో షూట్‌లో పాల్గొనడం కష్టంగా అనిపించేది. షాట్ అయిపోగానే జాగ్రత్తగా ఒక దగ్గర కూర్చోవడమే తప్ప... విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదు. అంతేకాదు గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నా. పవన్ సార్ సరసన నటించడం నిజంగా నా అదృష్టం. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. చాలా దయగలిగిన వారు, లెజెండ్, పవర్‌ఫుల్ కళ్లు.. ఇలా పవన్ సార్ గురించి చాలా చెప్పొచ్చు. ఆయన నటన చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఎంత కష్టమైన సన్నివేశమైనా ఇట్టే నటించేవారు. సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పూర్తిగా లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. కేవలం తన సన్నివేశంపైనే దృష్టిపెడతారు. షూటింగ్‌లో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా అని అన్నారు.
Latest News