![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:31 PM
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'దేవర' జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ఈ చిత్రం, మార్చి 28న జపాన్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ జపాన్‌లో ప్రమోషన్లలో పాల్గొన్నారు. జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన ఎన్టీఆర్, ఈ అనుభూతిని ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ "మీ ప్రేమతో నా మనసు నిండిపోయింది" అంటూ స్పందించారు.ఎన్టీఆర్ గత చిత్రాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ విడుదలైన బాద్‌షాతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమాను జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా జపాన్‌కి వెళ్లిన ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ.. జపాన్ అభిమానులను కలవడంతో పాటు అక్కడి స్థానిక మీడియాలలో దేవర ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు. అయితే జపాన్ ప్రజల ప్రేమకు ఫిదా అయిన తారక్ తాజాగా వారితో ఉన్న ఒక వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
Latest News