|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 06:53 AM
పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఈ ఏడాది జూన్ చివరి వారంలో ప్రారంభం కానుంది.ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లొకేషన్ల వేటలో నిమగ్నమైందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తనదైన శైలిలో, ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దనున్నారు. విజయ్ సేతుపతి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయింది. తొలి షెడ్యూల్‌లోనే విజయ్ సేతుపతితో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.కథకు అనుగుణంగా విజువల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న పూరి జగన్నాథ్, సాంకేతిక అంశాల్లోనూ రాజీ పడకుండా సినిమాను ఉన్నత స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు. కాగా, విజయ్ సేతుపతి నటించిన తాజా తమిళ చిత్రం 'ఏస్' ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Latest News