అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 11:53 AM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు. జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి ట్రాన్స్‌జెండర్ సుధాకర్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపాలిటీ అభివృద్ది లక్ష్యంగా సుధాకర్ ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను కాదని ఓటర్లు సుధాకర్ ను గెలిపించుకున్నారు.