|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 11:55 AM
ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గత 15 రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నడుస్తోంది. సిమిలిగుడకు సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ తదితర ప్రాంతాల్లో నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం రాత్రికి ఒడిశా షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. ఈ సందర్భంగా నటీనటులను చూసేందుకు అక్కడి అభిమానులు ఉత్సాహం కనబరిచారు. వారు సెట్‌కు వచ్చి నటీనటులు మరియు చిత్ర బృందంతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఇక రాజమౌళితో పాటు మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా అక్కడి ప్రజలతో దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం.
Latest News