|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:47 AM
ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై నూతన దర్శకద్వయం నరేశ్ దోనే, మణివరన్ ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రావూరి సురేశ్ బాబు నిర్మాత. ఈ సందర్భంగా తెనాలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ‘మా-ఏపీ’ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా చిత్ర విశేషాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులకు హ్యాకింగ్ మోసాలు సవాలుగా మారినందువల్లనే ఈ నూతన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నామని చెప్పారు. ఈ ఓటీటీ చిత్రాన్ని తమిళం, కన్నడ, హిందీ భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్ర దర్శకులు నరేశ్ దోనే, మణివరన్ మాట్లాడుతూ ‘మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురై డబ్బు పోగొట్టుకోవడం ఈ చిత్ర ప్రధాన కథాంశం’ అని తెలిపారు.
Latest News