|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:47 AM
పాన్ ఇండియా స్టార్ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2' లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ, ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న 'ఓదెల-2' థియేటర్స్ లో విడుదల కానుంది. తమన్నా ఫస్ట్ పోస్టర్ లో ఆభరణాలతో సాంప్రదాయ దుస్తులు ధరించి, ఒక సాధారణ మహిళగా కనిపిస్తునే ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, గాయం గుర్తులతో ఉన్నారు. దాంతో ఆమె పాత్రపై క్యూరియాసిటీ పెరిగింది. ఆ తర్వాత వారణాసి నేపథ్యంలో మిస్టీరియస్ లేయర్ ని యాడ్ చేస్తున్నాయి. 'ఓదెల -2'లోని తన పాత్ర గురించి తమన్నా మాట్లాడుతూ, ''సంపత్ నంది 'ఓదెల పార్ట్-2' ఐడియా చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఈజీ జోనర్ కాదు. ఒక పల్లెటూరి కథని ఇంత ఎక్సైటింగ్ గా, థ్రిల్లింగ్ గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీశారు. నేను ఏ సినిమా చేసిన ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఉండాలని కోరుకుంటాను. అలాంటి కొత్త ఓ కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్ గా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో హైయెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే. భైరవి క్యారెక్టర్ ని బిలీవబుల్ గా, నేచురల్ గా, మ్యాజికల్ గా చూపించడం నిజంగా బిగ్ ఛాలెంజ్. ఇది గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా'' అని అన్నారు.
Latest News