|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:46 AM
టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం భాషా భేదం లేకుండా అగ్రహీరోలతో సినిమాలు చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస ఛాన్స్ లు అందుకుంటూ స్టార్ ఇమేజ్ ను మరింత పెంచుకుంటుందీ డస్కీ బ్యూటీ. అయితే ఈ మధ్య సినిమా ఛాన్స్ లతో పాటు షాకింగ్ కామెంట్స్ తో సెన్సేషన్ గా మారుతోంది. తాజాగా జిగేల్ రాణి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో స్టార్ హీరోలతో పాటు టైర్ 2 హీరోలతో ఛాన్స్ లు కొట్టేసింది. అయితే తాజాగా నీలాంబరి చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికి తాను కూడా వివక్షతను ఎదుర్కొన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. కో-స్టార్స్ వల్ల ఇబ్బందులు పడ్డారా? అని అడిగిన క్వశ్చన్ కు బ్యూటీ చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. పైగా హీరో హీరోయిన్లకు చూపించే తేడా గురించి చెప్పేసింది.
Latest News