అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:45 AM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఈవెంట్ కు సిద్ధమవుతోంది. జూలై 4 నుండి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్ లో నాట్స్ 8వ తెలుగు సంబరాలు కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్, మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అమెరికా నుండి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు. నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Latest News