|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 11:24 AM
ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో కేతికశర్మ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో కొనసాగుతోంది.అయితే 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్ కేతిక శర్మ చేయాల్సిందట. తాజాగా ఆ చిత్ర నిర్మాత ఈ విషయాన్ని పంచుకున్నారు. నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో రానున్న చిత్రం 'రాబిన్ హుడ్' . మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు.''ఈ సినిమాను 'అది దా సర్‌ప్రైజ్' పాటతో కేతికశర్మ మరో స్థాయికి తీసుకెళ్లారు. 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ కోసం సమంత కంటే ముందు కేతికను కలవాలనుకున్నాం. కానీ, అప్పుడు మిస్ అయ్యాం. మళ్లీ ఇన్నేళ్లకు ఆమెతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆమె పాట ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీలీల చాలా బిజీగా ఉండి కూడా తేదీలు సర్దుబాటు చేసుకొని ఇందులో నటించారు'' అని చెప్పారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట రష్మికను అనుకున్నట్లు దర్శకుడు వెంకీ కుడుముల తెలిపారు. అయితే, డేట్స్ సర్దుబాటుకాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించలేకపోయిందన్నారు. కథ చెప్పగానే శ్రీలీల అంగీకరించారన్నారు. ఇది ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు. నితిన్- వెంకీ కుడుముల కాంబోలో రానున్న రెండో చిత్రమిది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేస్తుండడం విశేషం. ఇప్పటివరకూ విడుదలైన పాటలు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
Latest News