![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 02:48 PM
నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. 2023లో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించేలా ఉంది. మీరు ఓ లుక్కేయండి.ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన స్వాతి రెడ్డి సాంగ్ తో సహా టీజర్ విజువల్స్ అంచనాలు పెంచేశాయి. మొదటి భాగం కాలేజీ, లవ్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో ఉండగా మ్యాడ్ స్క్వేర్ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ & కామెడీ ఎంటర్టైనర్గా గోవా బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.మురళీధర్ గౌడ్ కొడుకు కోసం గోవాకి రావడం, అక్కడొచ్చే ఫన్నీ ఇన్సిడెంట్స్, సరదా డైలాగ్స్ తో ట్రైలర్ నిండిపోయింది. చివర్లో సత్యం రాజేష్, డైరెక్టర్ అనుదీప్ కేవీ, గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇక చివరగా భాయ్ అనే వాయిస్ తో ఫోన్ రావడం, నేను గర్ల్స్ అయితేనే మాట్లాడుతా అని రిటర్న్ లో డైలాగ్ రావడం మరింత అట్ట్రాక్ట్ చేస్తుంది.
Latest News