|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 10:24 AM
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో భోజనం చేసిన ఆయన, జగిత్యాలకు చేరుకున్నాక గురువారం రాత్రి వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడ్డారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.మరో వైపు మున్సిపల్ ఎన్నికల నుంచి వాటి ఫలితాలతోపాటు చైర్మన్ ఎన్నిక వరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. వాతావరణ పరిస్థితులు మార్పు తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు పేర్కొంటున్నారు.ఇక ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి, జీవన్ రెడ్డి వర్గం మధ్య వివాదం నెలకొంది. దీంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి.. సంజయ్ వర్గానికి చైర్మన్ పదవి, జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవి కేటాయించిన విషయం విదితమే.