|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:39 AM
నిధీ అగర్వాల్ ప్రస్తుతం అగ్ర హీరోలతో సినిమాలు చేస్తోంది. పవన్‌తో ‘హరిహర వీరమల్లు, ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రాలు సెట్స్ మీదున్నాయి. ఇటీవల ఆమె ఓ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె నటిస్తున్న చిత్రాలతోపాటు కెరీర్ బిగినింగ్ డేస్ గురించి చెప్పుకొచ్చారు.‘‘బాలీవుడ్ చిత్రం మున్నా మైకేల్’తో నటిగా నా కెరీర్ మొదలైంది. టైగర్ ష్రాఫ్ కథానాయకుడు. ఈ సినిమా అంగీకరించిన తర్వాత టీమ్ నాతో కాంట్రాక్ట్‌పై సైన్ చేయించుకుంది. అందులో సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధి, విధానాలు, షరతులు ఉన్నాయి. అందులోనే నో డేటింగ్ అనే షరతు కూడా పెట్టారు. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేట్ చేయకూడదని దాని అర్థం. కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు. ఆ తర్వాతే నాక్కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయా. నటీనటులు ప్రేమలో పడితే వర్క్‌పై దృష్టిపెట్టరని ఆ టీమ్ భావించి ఉండొచ్చు. అందుకే ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందనుకున్నా’’ అని నిధి అగర్వాల్ అన్నారు. ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి చెబుతూ ‘‘ఈ ప్రపంచంలో మంచి, చెడు రెండూ ఉన్నాయి.కేవలం మంచి మాత్రమే ఉందనడానికి వీల్లేదు. నేను మంచిదాన్ని కాబట్టి, అందరూ నాతో మంచిగా ఉంటారు.. నా గురించి మంచిగానే మాట్లాడుకుంటారు అనుకుంటే కుదరదు. కొంతమంది మన గురించి చెడుగా చెబుతుంటారు. మంచి లేదా చెడు ఏదైనా సరే చెప్పడానికి ఒక పద్థతి ఉంటుంది. హద్దులు దాటి.. అసభ్యపదాతో కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నేను చాలా స్ర్టాంగ్‌గా ఉంటా. ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోను. సోషల్‌మీడియా కామెంట్స్ నాపై పెద్దగా ప్రభావం చూపించవు. కానీ, అందరూ నాలా ఉండరు. ఇలాంటి కామెంట్స్ చూసి వారు ఎంతో బాధపడతారు. ఈ విషయాన్ని గ్రహించి మర్యాదపూర్వకంగా కామెంట్స్ చేేస్త బాగుంటుంది’’ అని నిధీ చెప్పారు.
Latest News