|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:42 AM
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మోహన్‌లాల్ మాట్లాడుతూ.... ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు కలిగింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఇండియాలోనే టాలీవుడ్ ది బెస్ట్ ఇండస్ట్రీగా ఉంది. కేరళలో మేం అన్ని భాషల చిత్రాలను చూస్తాం. ఇప్పుడు మా సినిమాల్ని కూడా అన్ని భాషల వాళ్లు చూస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా చిత్రాలను చేస్తున్నాం. సినీ లవర్స్ అందరి కోసం మేం మూవీస్ తీస్తున్నాం. పృథ్వీరాజ్ ఈ చిత్రంతో తెరపై అద్భుతం చేశారు. మేం ముందుగా లూసిఫర్‌ను మూడు పార్టులుగా తీయాలని అనుకున్నాం. ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అయితే.. మూడో పార్ట్‌తో మళ్లీ వస్తాం. రెండేళ్లుగా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. సుజిత్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. పాలిటిక్స్, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని రకాల అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
Latest News