|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:07 PM
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో షైన్ టామ్ చాకో తండ్రి సి.పి. చాకో మరణించగా, నటుడు షైన్ టామ్ చాకో, ఆయన తల్లి గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.వివరాల్లోకి వెళితే... శుక్రవారం తెల్లవారుజామున షైన్ టామ్ చాకో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు, సోదరుడు మరియు డ్రైవర్‌తో కలిసి వారు ప్రయాణిస్తుండగా, తమిళనాడులోని ధర్మపురి సమీపంలో సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదం చాలా తీవ్రంగా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఐదుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలపాలైన సి.పి. చాకో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Latest News