|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 07:02 PM
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం తిప్పర్తి మండలం, శిలార్మియా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులను వేగవంతం చేసి, ఉగాది పండుగకు ముందే పూర్తిచేసుకుని గృహప్రవేశాలు నిర్వహించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పేద ప్రజలకు స్వంత గృహాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయల సహాయంతో లబ్ధిదారులు తమ ఇళ్లను నిర్మించుకోవాలని తెలిపారు.