|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 07:16 PM
చారిత్రక బమృకున్ - ఉద్ - దౌలా లేక్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీ ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి గారుఈ చెరువును ప్రారంభించనున్నారు. కూకట్‌పల్లిలోని నల్లచెరువు ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9వ తేదీన నల్లచెరువును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు బమృకున్ - ఉద్ - దౌలా చెరువును గురువారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. చెరువు సుందరీకరణ పనులను తిలకించారు. చెరువు కట్టతో పాటు.. ఖాళీ ప్రదేశాల్లో నాటిన ఔషధ మొక్కలను పరిశీలించారు. పిల్లలు ఆడుకునే ప్లే ఏరియాలతో పాటు.. అన్ని వయసులవారు సేద దీరేందుకు వీలుగా చెరువు కట్టపై ఏర్పాటు చేసిన గజబోలు(గుమ్మటాలు)ను చూశారు. పాతబస్తీ సంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం, చెరువు చరిత్రను వివరించిన బోర్డులను పరిశీలించారు. చెరువును ప్రారంభించిన తర్వాత జరగనున్న సభ ఏర్పాట్లను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. హైడ్రా అదనపు కమిషనర్ శ్రీ ఆర్ సుదర్శన్‌గారు, అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్యగారితో పాటు.. పోలీసు శాఖ అధికారులు హైడ్రా కమిషనర్ వెంట ఉన్నారు. సభా ఏర్పాట్లపై సమీక్షించారు.