|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 10:01 PM
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖ వెల్లడించింది.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించడంతో పాటు పరిశుభ్రత, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.పది రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ పురోగతి వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ నెల 6న ఉమ్మడి జిల్లా స్థాయిలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఉత్తమంగా పనిచేసిన కార్యాలయాలు, సంస్థలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పత్రాలు అందజేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానళ్లను ఫాలో అవ్వండి. అలాగే మా ప్రజాతంత్ర YouTube ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ కథనాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడం మర్చిపోవద్దు.