|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 12:25 PM
గజ్వేల్ పట్టణంలో వాహన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురికి రూ. 50వేల చొప్పున, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో ఐదుగురికి రూ. 25వేల చొప్పున జరిమానా విధిస్తూ గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి గౌడ్ తీర్పు వెలువరించారు. గురువారం ఈ తీర్పు వెలువడినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళీ తెలిపారు. పట్టణంలోని పలు చౌరస్తాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ పది మంది పట్టుబడ్డారు.