|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 12:31 PM
తిరుమల శ్రీవారిని మాజీ తెలంగాణ ఎమ్మెల్సీ, జాగృతి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట కవిత దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులతో.. గత కొంతకాలంగా తీవ్రమైన మనోవేదన అనుభవించానని పేర్కొన్నారు. స్వామివారి దయతో కేసులనుంచి బయటకు వచ్చానని.. సత్యం, ధర్మం, న్యాయం తన వైపే ఉందని.. అందుకే దేవుడు కరుణించాడన్నారు. తిరుమల కాలినడకన వచ్చి దర్శనం చేసుకున్నానని.. రాబోయే కాలంలో కూడా తెలంగాణ ప్రజల పక్షాన పార్టీ పెట్టబోతున్నట్టు వివరించారు.. తనపై స్వామివారి దయ ఉండాలని... ఆంధ్ర, తెలంగాణ ఎప్పుడూ బాగుండాలని శ్రీవారిని కోరుకున్నామని చెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా ప్రజలుగా కలిసే ఉండాలని ఆకాంక్షించారు.