![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 04:14 PM
ప్రముఖ డిజిట్ల్ ప్లాట్ఫారంస్ లో ఒకటైన ఆహా ఒక కొత్త సిరీస్ ని ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ కి 'హోమ్ టౌన్' అనే టైటిల్ ని లాక్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుండి ఆహాలో హోమ్ టౌన్ ప్రీమియర్ కానుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, అన్నీ ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ పాల్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ కి నవీన్ మెదరం షోరన్నర్. MNOP మరియు AMOGHA కళలు ఈ ప్రాజెక్టును సంయుక్తంగా బ్యాంక్రోల్ చేశాయి.
Latest News