|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 06:57 PM
షాద్నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రజారక్షణకు దోహదపడాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ సూచించారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను సీఐ సీతారాం మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల బొకే అందజేశారు. ప్రజా రక్షణ విషయంలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, బాధితులకు తక్షణ పోలీసు సహాయం అందేలా విధుల్లో చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.