|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 10:21 AM
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కిలో రూ.300 మార్కును దాటాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లైవ్ బ్రాయిలర్ కోడి కిలో రూ.167, డ్రస్డ్ చికెన్ రూ.280-290, స్కిన్ లెస్ చికెన్ రూ.310 వరకు పలుకుతోంది. మరోవైపు పశ్చిమాసియా యుద్ధం కారణంగా గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో వాటి ధరలు రూ.3.50కి పడిపోయాయి. చికెన్ రూపంలో లాభాలు ఆశిస్తుంటే, గుడ్ల రూపంలో రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు చెబుతున్నారు.. ఇక ఏపీకి ఒడిశా నుంచి ఎక్కువగా కోళ్లు దిగుమతి అవుతూ ఉంటాయి. కానీ ఆ రాష్ట్రంలో కూడా కోళ్ల ధరలు పెరిగాయి. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను తీసుకొస్తున్నారు. డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో మన దేశం నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీని వల్ల గుడ్ల నిల్వలు పెరగడంతో ధరలు తగ్గాయి. స్ధానిక మార్కెట్లలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ.3.50కే పలుకుతోంది. ఇక నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించింది. దేశం నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో పాల్ట్రీ రంగానికి రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది.