|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:38 AM
ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో 'నాయగన్' మూవీ వచ్చి 38 సంవత్సరాలైంది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచ సినిమాల్లోని 100 ఆల్ టైమ్ క్లాసిక్స్ జాబితాలో చోటు దక్కించిన ఏకైక చిత్రం 'నాయగన్'. ఈ ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ వచ్చిన ఇంతకాలానికి తిరిగి కమల్ హాసన్, మణిరత్నం కలిసి 'థగ్ లైఫ్' చేస్తున్నారు. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ యేడాది జూన్ 5న 'థగ్ లైఫ్' పాన్ ఇండియా స్థాయిలో జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ జర్నీని ప్రారంభించినట్టు మేకర్స్ తెలిపారు. ఆరు దశాబ్దాల సినిమా కెరీర్ లో కమల్ హాసన్ ఎన్నో అత్యద్భుతమైన పాత్రలను చేశారు. అందులో 'థగ్ లైఫ్' కూడా ఒకటిగా నిలువబోతోంది. ఈ విజువల్ వండర్ కి రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, ఏకా లఖాని కాస్ట్యూమ్ డిజైనర్. 'థగ్ లైఫ్' మూవీని మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది.
Latest News