|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 12:31 PM
కాల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల యువకులను, క్రికెట్ అభిమానులను మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు . కెసిఆర్ క్రికెటర్ ట్రోఫీ – సీజన్ 3”ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు.ఈ సీజన్‌లో 100కు పైగా జట్లు పాల్గొననున్నాయి.యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే కాకుండా, గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ బలోపేతానికి ఈ ట్రోఫీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.టోర్నీలో పాల్గొన్న యువకులందరూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.