|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 01:24 PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి నాయకులు ఒక మున్సిపాలిటీని దక్కించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి నాయకులు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్‌బీ) తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు.తెలంగాణ జాగృతి నాయకులు ఏఐఎఫ్‌బీ పార్టీ తరఫున మొత్తం 10 వార్డుల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఏఐఎఫ్‌బీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో వార్డును దక్కించుకున్నాయి.