|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 11:35 AM
తెలంగాణలో సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో, రాబోయే ఆరు నెలల్లో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. గ్రామాల్లో, పట్టణాల్లో విజయం సాధించిన అధికార పార్టీ, ఇప్పుడు నగరంలోనూ తమ సత్తా చాటాలని చూస్తోంది. గత GHMC ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఈసారి గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత జరిగే ఈ తొలి ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం దక్కుతుందో వేచి చూడాలి.ర్పొరేషన్ (ఎంఎంసీ)గా విభజించింది. ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న ప్రాంతం మొత్తం... ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉంటుంది. జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్-3(1) ప్రకారం జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది. అయితే పునర్విభజన తర్వాత జీహెచ్ఎంసీ ప్రస్తుత స్వరూపం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం...
పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్... 6 జోన్‌లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు ఉండనుంది. జీహెచ్‌ఎంసీ మొత్తం సుమారు 689 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది పాలన వికేంద్రీకరణను బలోపేతం చేయడానికి, పౌర సేవలను మెరుపరచడాని తోడ్పడనుంది. పునర్నిర్మించబడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్‌లు ఉన్నాయి. మొత్తంగా కొత్తగా ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు(డివిజన్లు) ఉన్నాయి. ఇక, ఆర్‌వీ కర్ణన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లను పర్యవేక్షించే ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్‌ను ప్రభుత్వం నియమించింది.