|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 11:32 AM
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు విషెస్ తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని, గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ఓడిపోయిన వారు అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని, వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు నిర్వహిస్తానని, ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు.