|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 12:24 PM
జగదేపూర్ మండలం పీర్లపల్లి గ్రామం వద్ద ఉన్న 15వ కాల్వ ప్యాకేజీ నుంచి గేట్ వాల్‌ను తిప్పి, రైతుల కోరిక మేరకు నీటిని విడుదల చేశారు.ఈ నీటి విడుదలతో ఇక పెళ్లి మండలం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సమస్యకు ఉపశమనం లభించనుంది.నీటిని విడుదల చేసిన అనంతరం గంగమ్మకు కొబ్బరికాయలు కొట్టి,పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు మంచి పంటలు పండాలని ప్రార్థిస్తూ సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,సాగునీటి అందుబాటు ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.