కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 06:52 PM
దళితుల రక్షణకు జాతీయ ఎస్సీ కమిషన్ కట్టుబడి ఉందని సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ తెలిపారు. కోదాడలో లాకప్ లో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అడిషనల్ డీజీ చౌహన్, మందకృష్ణ మాదిగ పరామర్శించారు. రాజేష్ తల్లి లలితమ్మకు పెన్షన్ పత్రం అందజేశారు. సీఐ సస్పెన్షన్, ఎస్సైపై చర్యలు, 10 రోజుల్లో రీ–పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. కుటుంబానికి ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి ఇవ్వాలని సూచించారు. SP నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.