|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 06:56 PM
హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ ప్రత్యేక నజర్ .హంగ్ ఉన్న 8 మున్సిపాలిటీలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జిలుగా నియమించిన కేటీఆర్. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని, ఎన్నిక సాఫీగా నిర్వహించుకోవడమే లక్ష్యం. స్థానిక పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన కేటీఆర్. తోర్రూర్‌కు ఇన్‌ఛార్జిలుగా నియామకమైన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డి . జనగామ ఇన్‌ఛార్జిలుగా నియామకమైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మరియు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. క్యాతనపల్లికి ఇన్‌ఛార్జిలుగా నియామకమైన ఎమ్మెల్యే కోవ లక్ష్మిఖానాపూర్‌కు ఇన్‌ఛార్జిలుగా నియామకమైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.ఇంద్రేశంకు ఇన్‌ఛార్జిలుగా నియామకమైన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి , కాగజ్ నగర్‌కు ఇన్‌ఛార్జిలుగా నియామకమైన మాజీ మంత్రి జోగు రామన్న, జహీరాబాద్‌కు ఇన్‌ఛార్జిలుగా నియామకమైన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మరియు సునితా లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నంకు ఇన్‌ఛార్జిలుగా నియామకమైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు