|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:36 PM
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించాలని బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. జనరల్ మహిళా రిజర్వేషన్ స్థానంలో బీసీ మహిళకు అవకాశం కల్పించి, బీసీలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. గతంలో జనరల్ స్థానంలో అగ్రవర్ణాలకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కేటాయించి బీసీలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని 48 వార్డులలో సగానికి పైగా బీసీలు గెలుపొందారని, జనాభా దామాషా ప్రకారం బీసీలకే చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బీసీలకు చైర్మన్ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.