|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:25 PM
నామినేషన్ కోసం రూ.8 కోట్ల పన్ను చెల్లింపు..ఓటమి పాలైన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి. నిజామాబాద్ కార్పొరేషన్ 19వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన కాటిపల్లి శమంత . ఆమెను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో, నామినేషన్ వేసేందుకు అడ్డుగా ఉన్న రూ.8 కోట్ల పన్ను బకాయిలు చెల్లించిన శమంత. మేయర్ పదవి వస్తుందని దాదాపు ఓటుకు రూ.5 వేల నుండి రూ.10 వేల వరకు ఇచ్చినట్లు, మిగతా డివిజన్లకు కూడా డబ్బులు సర్దడంతో రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కానీ ఫలితాల్లో ప్రజలు ఆమెకు షాక్ ఇచ్చి, ఆమె డివిజన్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించడంతో తీవ్ర ఆవేదనతో కౌంటింగ్ కేంద్రం నుండి వెనుదిరిగిన శమంత