|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:56 PM
కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్ మాత్రమే ధీటుగా ఎదుర్కొంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని వ్యాఖ్యానించారు. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం ఓడిపోయామని బాధపడొద్దని గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నవాళ్లు చరిత్రలో కలిశారని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. హంగ్ మున్సిపాలిటీలు ఎవరికి దక్కుతాయో చూడాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.