|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 07:08 PM
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరుల సౌకర్యార్థం MDR ఫౌండేషన్ ప్రత్యేక రంజాన్ క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో ప్రతి రోజుకు సంబంధించిన సహార్ (ఉపవాస ప్రారంభం) మరియు ఇఫ్తార్ (ఉపవాస విరమణ) సమయాలను స్పష్టంగా పొందుపరచడం ద్వారా ఉపవాసాలు సక్రమంగా పాటించేందుకు సహాయపడే విధంగా రూపొందించారు.శుక్రవారం, పటాన్‌చెరు పట్టణంలోని పృథ్వీరాజ్ గారి కార్యాలయంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముస్లిం సోదరులతో కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా, పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ రంజాన్ మాసం ఆధ్యాత్మికత, నియమం, దాతృత్వానికి ప్రతీక. సమాజంలో ఐక్యత, శాంతి, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు మా వంతు ప్రయత్నంగా ఈ క్యాలెండర్‌ను అందిస్తున్నాం అని తెలిపారు.ఈ సందర్భంలో, ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, భక్తిని నింపాలని ఆకాంక్షించారు