|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 10:33 AM
TG: హైదరాబాద్ గోపన్‌పల్లిలో ఏటీఎం క్యాష్ చోరీ కలకలం రేపింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. ఏటీఎంల్లో నగదు నిర్వహణ చేపట్టే సీఎంస్ (క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్) సంస్థ కార్యాలయం తిరుమలగిరిలో ఉంది. సంస్థలో అజిత్ కుమార్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం కస్టోడియన్లు రామకృష్ణ, అబ్దుల్ మాలిక్, సెక్యూరిటీ గార్డు పెరుమాల్‌లు.. అజిత్ నడిపే వ్యానులో డబ్బులతో బయలుదేరారు. అత్తాపూర్, కిస్మత్‌పూర్, అల్కాపూర్, మణికొండ ప్రాంతాల్లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తూ.. సాయంత్రం 4.30కి గోపనపల్లికి వచ్చారు. కస్టోడియన్లు కొంత నగదుతో ఏటీఎంలోకి వెళ్లగా సెక్యూరిటీ గార్డు, డ్రైవర్ వ్యాన్ వద్ద ఉన్నారు. అదే సమయంలో సెక్యూరిటీ గార్డు బాత్ రూంకు వెళ్లగా, ఇదే అదనుగా డ్రైవర్ డబ్బుల వ్యాన్‌తో పారిపోయాడు. పోలీసులు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆరా తీయగా.. తెల్లాపూర్‌లో వ్యాన్ ఉన్నట్లు తేలింది.