|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:44 PM
మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. తనను బెదిరించినందువల్లే ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. 'మహదేవప్పను బెదిరించినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. రాజకీయాల కోసం దుష్ప్రచారం తగదు. గతంలో అతడు కాంగ్రెస్ కార్యకర్తనే. పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజం నిగ్గుతేల్చాలి' అని మంత్రి అన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది.నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌కు ఒకరోజు సమయం ఉండగా ఓ గిరిజన అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో 6వ వార్డు ఎన్నిక ఆగిపోనుంది. మరోవైపు మిగతా చోట్ల కూడా అధికార పార్టీ వత్తిళ్లతో ఎన్నికలు సజవుగా జరుగుతాయా లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.