|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:53 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 90% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఓటర్లు స్పష్టమైన అవగాహనతో ఉన్నారని, అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, ఎమ్మెల్సీ, జూబ్లీహిల్స్, పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేయబోతోందని ఆయన అన్నారు.మరో ఎనిమిదేళ్లు పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యం. రెండేళ్ల పరిపాలనలోనే ప్రజలకు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితమే ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీగా మారుతుంది” అని అన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోవడానికి ఏమీ లేదని విమర్శించారు. ఆ కాలంలో అభివృద్ధి కంటే ప్రచారమే ఎక్కువైందని, ప్రజలు ఇప్పుడు ఆ విషయాన్ని గ్రహించారని వ్యాఖ్యానించారు.