|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 04:01 PM
బోథ్ నియోజకవర్గం గుడిహత్నూర్ మండలంలోని తోషం తండాలో శనివారం ఐదేళ్ల బాలికపై వీధికుక్క దాడి చేసింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్నప్పుడు జరిగిన ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది. గ్రామంలో వీధికుక్కల బెడద ఎక్కువైందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తండా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.