|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 12:09 PM
పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలోని కాశిరెడ్డి పల్లి ఫంక్షన్ హాల్లో బంజారా శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బంజారా సమాజ ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి వేడుకలో BRS నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు సేవాలాల్ మహారాజ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలు, సమాజాభివృద్ధి మరియు సంప్రదాయాలను నిలుపుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ వేడుకలు బంజారా సమాజ ఆత్మాభిమానాన్ని పెంపొందించడంతో పాటు సంఘబంధాన్ని మరింత బలోపేతం చేసే మంచి అవకాశం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ గారు, పరమేష్ గారు, బలరాం గారు, స్థానిక నాయకులు, బంజారా సమాజ ప్రతినిధులు మరియు MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.