|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 12:30 PM
శనివారం తెల్లవారుజామున పటాన్చెరు మండలం పోచారం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా కొట్టడంతో ఇంద్రేశానికి చెందిన ఎండి ముజీబుద్దీన్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు అస్లాం, చంద్రశేఖర్, నిత్యానంద్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.